రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌లో కొత్త ఫోన్లు..

రెడ్‌మీ మధ్యశ్రేణి మార్కెట్‌ లక్ష్యంగా ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త ఫోన్లను తీసుకురానుంది. రెడ్‌మీ నోట్ 10 పేరుతో కొత్త సిరీస్‌లో వీటిని విడుదల చేయనున్నట్లు....

Updated : 27 Dec 2022 19:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెడ్‌మీ మధ్యశ్రేణి మార్కెట్‌ లక్ష్యంగా ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త ఫోన్లను తీసుకురానుంది. రెడ్‌మీ నోట్ 10 పేరుతో కొత్త సిరీస్‌లో వీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. గౌగ్విన్‌, గౌగ్విన్‌ ప్రో పేరుతో గతంలో షావోమి వీటిని రిజిష్టర్‌ చేసిందట. తాజాగా ఈ ఫోన్లను షావోమి ఎంఐ 10టీ సిరీస్‌ పేరుతో చైనాతో పాటు ఇతర మార్కెట్లో సెప్టెంబరు 30 తేదీన విడుదల చేయనుంది. భారత్‌లో రెడ్‌మీ  బ్రాండ్‌కు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ బ్రాండ్ కింద రెడ్‌మీ నోట్ 10, నోట్ 10 ప్రో పేరుతో వీటిని తీసుకొస్తున్నారట.

ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారట. 4,820 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని సమాచారం. హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. అలానే 64, 108 ఎంపీ కెమెరాలు ఉంటాయట. ఎన్ని అంగుళాల డిస్‌ప్లే? కెమెరాలు ఎన్ని ఉంటాయి? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. అక్టోబరులో భారత మార్కెట్లోకి తీసుకొస్తారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని