YouTube: పెద్ద వీడియోల నుంచి షార్ట్స్‌.. యూట్యూబ్‌ కొత్త ఫీచర్‌!

వీడియో కంటెంట్‌ క్రియేటర్స్‌కు యూట్యూబ్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. యూట్యూబ్‌లో ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను షార్ట్స్‌గా మార్చుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది...

Published : 01 Aug 2022 01:58 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: వీడియో కంటెంట్‌ క్రియేటర్స్‌కు యూట్యూబ్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. యూట్యూబ్‌లో ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను షార్ట్స్‌గా మార్చుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో కంటెంట్‌ క్రియేటర్స్‌ పెద్ద వీడియోలను సులువుగా షార్ట్స్‌గా మార్చి ఎక్కువ కంటెంట్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావచ్చని యూట్యూబ్‌ అభిప్రాయపడింది. ఎక్కువ నిడివి ఉన్న వీడియోల నుంచి 60 సెకన్ల కన్నా తక్కువ నిడివి వీడియోను ఎంపిక చేయడం లేదా షార్ట్స్‌లోని కెమెరా ఆప్షన్‌తో కొత్త వీడియను షూట్ చేయడం లేదా గ్యాలరీ నుంచి 60 సెకన్ల షార్ట్స్‌ను అప్‌లోడ్ చేయొచ్చని తెలిపింది. ఈ ఫీచర్‌ ద్వారా క్రియేట్‌ చేసిన షార్ట్స్‌కు కంటెంట్ డెవలపర్‌ ఎక్కువ నిడివి ఉన్న వీడియో లింక్‌ను యాడ్‌ చేయొచ్చు. దాంతో షార్ట్స్‌ పూర్తయిన వెంటనే ఒరిజినల్‌ వీడియోకు వ్యూయర్‌ను రీడైరెక్ట్ చేస్తుంది. కంటెంట్ క్రియేటర్స్ కేవలం తమ ఒరిజినల్‌ వీడియోల నుంచి మాత్రమే షార్ట్స్‌ను రూపొందించగలరని యూట్యూబ్‌ తెలిపింది.

‘‘యూట్యూబ్‌లో చాలా మంది ఎంతో కాలంగా కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. వాటి నుంచి షార్ట్స్ రూపొందించి, యూట్యూబ్‌కు వస్తోన్న కొత్త వ్యూయర్స్‌కు పరిచయం చేయాలని ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నాం. ఇటీవలి కాలంలో షార్ట్స్‌ వీడియోలకు వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఫీచర్‌తో కొత్త వారితో పాటు, ప్రస్తుతం ఉన్న వ్యూయర్స్‌ను కూడా ఆకర్షించవచ్చు’’ అని యూట్యూబ్‌ అభిప్రాయపడింది. ఇటీవలే ఫొటో/వీడియో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఇదే తరహా ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యూజర్స్ అప్‌లోడ్‌ చేసే ప్రతి వీడియో ఆటోమేటిక్‌గా రీల్స్‌గా మారిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని