ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఇంజినీర్ల సంఘాలు

మూడు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నీటిపారుదల ఇంజినీర్ల పదోన్నతి సమస్య పరిష్కారానికి సూపర్‌ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఇంజినీర్ల సంఘాలు

Published : 13 Aug 2022 05:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: మూడు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నీటిపారుదల ఇంజినీర్ల పదోన్నతి సమస్య పరిష్కారానికి సూపర్‌ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఇంజినీర్ల సంఘాలు పేర్కొన్నాయి. శుక్రవారం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ను విశ్రాంత ఇంజినీర్ల సంఘం ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్‌రెడ్డి, రాంరెడ్డి, రమణానాయక్‌, ఇంజినీర్ల ఐకాస నుంచి టి.వెంకటేశం, హైదరాబాద్‌ ఇంజినీర్ల సంఘం నుంచి మహేందర్‌, చక్రధర్‌, కోటేశ్వర్‌రావు, శంకరప్రసాద్‌ కలిసి ప్రభుత్వ నిర్ణయంపై కృతజ్ఞతలు తెలిపారు. గురువారం నాడు మంత్రివర్గ సమావేశంలో సూపర్‌ న్యూమరరీ కింద 12 సీఈ, ఎస్‌ఈ పోస్టులకు ఆమోదం, ఇంజినీర్ల ప్యానెల్‌ ఇంటిగ్రేటెడ్‌ జాబితాను రూపొందించి అదనంగా 13 సీఈ, 4 ఎస్‌ఈ పదోన్నతులు కల్పించేలా నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని