యాదాద్రిలో 20 నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ నెల 20 నుంచి 22 వరకు జరగనున్నాయి. తొలి రోజు జయంతి సంబురం, 22న ఉట్ల క్రీడోత్సవం, రుక్మిణీ కల్యాణం నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 15 Aug 2022 06:25 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ నెల 20 నుంచి 22 వరకు జరగనున్నాయి. తొలి రోజు జయంతి సంబురం, 22న ఉట్ల క్రీడోత్సవం, రుక్మిణీ కల్యాణం నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తుల రద్దీ: వారాంతపు రోజైన ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధికంగా రావడంతో యాదాద్రి ప్రధానాలయ వీధులు, మండపాలు కిటకిటలాడాయి. సుమారు 30 వేల మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించినట్లు అంచనా. శ్రీస్వామి వారి నిత్యకల్యాణంలో 110 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల్లో 416 జంటలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పార్కింగ్‌ చేసిన వాహనాలతో కొండపైన బస్‌ బే ప్రాంగణం నిండిపోయింది. ఆలయానికి నిత్యాదాయం రూ.43,65,662 సమకూరినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని