23 మందికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో 2022 సంవత్సరానికి 49 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో 23 మంది ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యులున్నారు. అత్యధికంగా జయశంకర్‌

Updated : 03 Sep 2022 04:44 IST

ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఎంపిక
వీరిలో వర్సిటీ ఆచార్యులు 23 మంది.. డిగ్రీ కళాశాలల అధ్యాపకులు 26 మంది..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో 2022 సంవత్సరానికి 49 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో 23 మంది ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యులున్నారు. అత్యధికంగా జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అయిదుగురికి పురస్కారాలు దక్కాయి. మిగిలిన 26 మంది ఆయా వర్సిటీలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నవారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల నుంచి ముగ్గురు ప్రిన్సిపాళ్లు, ఎనిమిది మంది అధ్యాపకులు అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం జీఓలు జారీ చేశారు. వారందరికీ గురుపూజోత్సవం నాడు ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది.

వర్సిటీల వారీగా ఎంపికైనవారు
ఓయూ: పి.రాజశేఖర్‌(సివిల్‌), ఎం.రాములు(ఆర్థికశాస్త్రం), మంజుల భానూరి(బయోకెమిస్ట్రీ), నజియా సుల్తానా(కామర్స్‌)
జేఎన్‌టీయూహెచ్‌: ఎ.జయలక్ష్మి(ఎలక్ట్రికల్‌), బి.రమాదేవి(రసాయనశాస్త్రం)
కాకతీయ: టి.శ్రీనివాసరావు(కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)
శాతవాహన: మహమ్మద్‌ అబరుల్‌ బక్వీ(ఉర్దూ)
తెలంగాణ: కె.శివశంకర్‌(మాస్‌ కమ్యూనికేషన్‌)
పాలమూరు: ఎం.నూర్జహాన్‌(రసాయనశాస్త్రం)
మహాత్మాగాంధీ: కె.అరుణప్రియ(ఆంగ్లం)
అంబేడ్కర్‌ సార్వత్రిక: ఐ.ఆనంద్‌ పవర్‌(కామర్స్‌)
జేఎన్‌ఏఎఫ్‌ఏయూ: ప్రీతి సంయుక్త(పెయింటింగ్‌)
కొండా లక్ష్మణ్‌ ఉద్యాన: సీహెచ్‌.రాజాగౌడ్‌(హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌, ఆదిలాబాద్‌)
జయశంకర్‌: శ్రీదేవి(అగ్రి పాలిటెక్నిక్‌, తోర్నాల), జయశ్రీ(సాయిల్‌ సైన్స్‌, రాజేంద్రనగర్‌), విజయలక్ష్మి(రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, హైదరాబాద్‌), ఎస్‌.ఎ.హుస్సేన్‌(రాజేంద్రనగర్‌), మాలతి(కేవీకే, మల్యాల)
తెలుగు విశ్వవిద్యాలయం: వనజ ఉదయ్‌ కొండిపర్తి(హైదరాబాద్‌)
పీవీ నరసింహారావు: ఎ.శరత్‌చంద్ర(డెయిరీ టెక్నాలజీ, కామారెడ్డి), సీహెచ్‌.హరికృష్ణ(రాజేంద్రనగర్‌)
నల్సార్‌ వర్సిటీ: కె.విద్యుల్లతరెడ్డి(శామీర్‌పేట)

విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లో...

ఓయూ: కె.మల్లికార్జునరావు(సిటీ కాలేజ్‌, హైదరాబాద్‌), ఆలూరి సాయిపద్మ(భవన్స్‌ వివేకానంద కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌, సైనిక్‌పురి), సీమాఘోష్‌(భవన్స్‌ వివేకానంద కాలేజ్‌, హైదరాబాద్‌), చందన్‌ బాబు(భవన్స్‌ కాలేజ్‌, హైదరాబాద్‌, గోపాల సుదర్శనం(ప్రభుత్వ కళాశాల, సిద్దిపేట), పెద్ది రజిని(భవన్స్‌ కాలేజ్‌, హైదరాబాద్‌), ఎ.దయానంద్‌(సిటీ కాలేజ్‌), కె.శారద(సిటీ కాలేజ్‌), దాసా కరుణాకర్‌(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సదాశివపేట), ఆకుల వెంకటేశం(తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి)
కాకతీయ: జి.సుహాసిని(పింగిళి బాలికల కళాశాల, హనుమకొండ), జరుపాల రమేశ్‌(ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల, ఖమ్మం), తిరునగరి యుగంధర్‌(ప్రభుత్వ కళాశాల, మహబూబాబాద్‌), ఇ.సత్యనారాయణ(కాకతీయ ప్రభుత్వ కళాశాల, హనుమకొండ), బి.శ్రీనివాసగౌడ్‌(ఏబీవీ ప్రభుత్వ కళాశాల, జనగామ), ఎ.కవిత(ప్రభుత్వ కళాశాల, మరిపెడ, మహబూబాబాద్‌), బి.కవిత(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వర్ధన్నపేట, వరంగల్‌)
శాతవాహన: పి.దినకర్‌(ప్రభుత్వ కళాశాల, హుజూరాబాద్‌), హర్జోత్‌ కౌర్‌(ప్రభుత్వ కళాశాల, జగిత్యాల), టి.శ్రీనివాస్‌(ప్రభుత్వ కళాశాల, అగ్రహారం)
పాలమూరు విశ్వవిద్యాలయం: జి.సత్యనారాయణగౌడ్‌(ఎంవీఎస్‌ ప్రభుత్వ కళాశాల, మహబూబ్‌నగర్‌), పి.రాములు(ఎంవీఎస్‌ ప్రభుత్వ కళాశాల, మహబూబ్‌నగర్‌)
తెలంగాణ విశ్వవిద్యాలయం: డి.ఆడెప్ప(గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల, నిజామాబాద్‌), ఇ.లక్ష్మీనారాయణ(గిరిరాజ్‌ కళాశాల, నిజామాబాద్‌)
లైబ్రేరియన్‌: వీరప్రసాద్‌(ప్రభుత్వ కళాశాల, బోధన్‌)
ఫిజికల్‌ డైరెక్టర్‌: ఎం.రవీందర్‌రావు(బాబూ జగ్జీవన్‌రామ్‌ ప్రభుత్వ కళాశాల, నారాయణగూడ)

ఇంటర్‌ విద్యాశాఖలో...

ప్రిన్సిపాళ్లు: సీహెచ్‌.రమణమూర్తి(ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మహేశ్వరం), ఎం.కవితా కిరణ్‌(అలియా జూనియర్‌ కళాశాల, హైదరాబాద్‌), ఎస్‌.వెంకటేశ్వర్‌రావు(కోహిర్‌, సంగారెడ్డి)

జూనియర్‌ అధ్యాపకులు: స్వప్న(సికింద్రాబాద్‌), ఉపేందర్‌(రాయదుర్గం), వెంకటేశ్వర్లు(నల్గొండ), వెంకటేశ్వర్లు(హయత్‌నగర్‌), సత్యపాల్‌రెడ్డి(దిలావర్‌పూర్‌, నిర్మల్‌), గీతారాణి(సికింద్రాబాద్‌),షేక్‌ జాన్‌ పాషా(నెమ్మికల్‌, సూర్యాపేట), లక్ష్మయ్య(నేరేడుచర్ల, సూర్యాపేట)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని