వ్యాసరచన విజేతలకు బహుమతి ప్రదానం

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని గత నెల 21న నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలకు డీజీపీ మహేందర్‌రెడ్డి నగదు బహుమతులు అందజేశారు.

Published : 29 Nov 2022 04:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని గత నెల 21న నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలకు డీజీపీ మహేందర్‌రెడ్డి నగదు బహుమతులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై, ఆ పైస్థాయి అధికారులకు, కిందిస్థాయి సిబ్బందికి వేర్వేరుగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, తృతీయ బహుమతిగా రూ.10 వేల చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు గోవింద్‌సింగ్‌, జితేంద్ర, శివధర్‌రెడ్డి, అభిలాషబిస్త్‌, నాగిరెడ్డి, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సై పైస్థాయిలో విజేతలు

1. కె.అశోక్‌కుమార్‌, ఏఎల్‌ఐ (పీటీసీ-వరంగల్‌)- ప్రథమ

2. సునీత మోహన్‌, అదనపు ఎస్పీ (పీటీసీ-కరీంనగర్‌)- ద్వితీయ

3. ఎల్‌.స్రవంతి, ఆర్‌.ఎస్‌.ఐ., (సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌-నిజామాబాద్‌) తృతీయ

కిందిస్థాయి..

1. ఎ.రాజేశ్‌, (కానిస్టేబుల్‌-బెల్లంపల్లిటౌన్‌ పీఎస్‌)- ప్రథమ

2. పి.అరుణకుమారి, (మహిళా కానిస్టేబుల్‌-సదాశివపేట పీఎస్‌)- ద్వితీయ

3. టి.సంపత్‌, (కానిస్టేబుల్‌-కాళేశ్వరం పీఎస్‌) తృతీయ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని