సికింద్రాబాద్‌-బెంగళూరు మధ్య విద్యుత్‌ రైళ్లే

సికింద్రాబాద్‌ నుంచి ఏపీ మీదుగా బెంగళూరు వరకు ఇకపై పూర్తిగా విద్యుత్‌ ఇంజిన్లతో కూడిన రైళ్లు నడిపేందుకు అవకాశం ఏర్పడింది.

Updated : 28 Mar 2023 05:20 IST

గద్వాల్‌-కర్నూలు సిటీ మధ్య విద్యుదీకరణ

ఈనాడు-అమరావతి: సికింద్రాబాద్‌ నుంచి ఏపీ మీదుగా బెంగళూరు వరకు ఇకపై పూర్తిగా విద్యుత్‌ ఇంజిన్లతో కూడిన రైళ్లు నడిపేందుకు అవకాశం ఏర్పడింది. ఇందులో ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న గద్వాల్‌-కర్నూలు సిటీ మధ్య 54 కి.మీ.మార్గం విద్యుదీకరణ పూర్తయి అందుబాటులోకి వచ్చింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌ నుంచి ధర్మవరం వరకు, నైరుతి రైల్వే పరిధిలో ధర్మవరం నుంచి బెంగళూరు వరకు అంతరాయం లేకుండా  విద్యుత్‌ ట్రాక్షన్‌ ద్వారా రైళ్లను నడిపేందుకు వీలుకలిగింది. దీని వల్ల ప్రయాణికుల, సరకు రవాణా రైళ్లను మార్గమధ్యలో నిలిపే సమయం తగ్గుతుందని, రైళ్ల వేగం పెంపునకు అవకాశముంటుందని, ఇంధన ఖర్చులు తగ్గుతాయని అధికారులు తెలిపారు.  సికింద్రాబాద్‌-బెంగళూరు మధ్య విద్యుత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సోమవారం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని