JEE Main: జేఈఈ మెయిన్‌కు 12.30 లక్షల దరఖాస్తులు

దేశవ్యాప్తంగా జనవరి 24వ తేదీ నుంచి జరగనున్న జేఈఈ మెయిన్‌ తొలి విడతకు రికార్డు స్థాయిలో 12.30 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Updated : 09 Dec 2023 08:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా జనవరి 24వ తేదీ నుంచి జరగనున్న జేఈఈ మెయిన్‌(JEE Main) తొలి విడతకు రికార్డు స్థాయిలో 12.30 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య 3.70 లక్షలు అధికం. ఈ సారి అత్యధిక దరఖాస్తుల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. మహారాష్ట్ర నుంచి 1.60 లక్షల మంది, ఏపీ నుంచి 1.30 లక్షలు, తెలంగాణ నుంచి 1.20 లక్షల మంది పరీక్షలు రాసేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జేఈఈ మెయిన్‌ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో చేరొచ్చు. బీటెక్‌ సీట్ల కోసం మెయిన్‌లో పేపర్‌-1, బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్‌-2 రాయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని