Jangaon: జనగామ జిల్లాకు ‘సర్దార్‌ సర్వాయి పాపన్న’ పేరు!

జనగామ జిల్లా పేరును సర్దార్‌ సర్వాయి పాపన్నగా మార్చే బాధ్యత తీసుకుంటానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Updated : 16 Dec 2023 08:07 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: జనగామ జిల్లా పేరును సర్దార్‌ సర్వాయి పాపన్నగా మార్చే బాధ్యత తీసుకుంటానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ ఎన్టీఆర్‌ కళామందిరంలో తెలంగాణ గౌడ సంఘం, పీసీసీ కల్లుగీత విభాగం ఆధ్వర్యంలో పలువురు నేతలు రాష్ట్ర మంత్రి పొన్నం    ప్రభాకర్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గౌడ కులస్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. రాష్ట్రంలో బీసీ కులగణన నిర్వహించడంపైనా ఆలోచన చేస్తామన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్‌ తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌  విమర్శించారు. కార్యక్రమంలో మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే రాజలింగం, కాంగ్రెస్‌ కార్యదర్శి శ్రీకాంత్‌గౌడ్‌, గౌడ సంఘం నేతలు బాలరాజుగౌడ్‌, అయిలి వెంకన్న, జైగౌడ్‌ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డా.వట్టికూటి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని