ఏకాగ్రత పెంచే వామనగుంటలు

ఆటలు పిల్లలకు సరదా, సంతోషాన్ని ఇవ్వడంతో పాటు కొన్ని మోటార్‌ స్కిల్స్‌నీ అలవరచాలి. అలాంటిదే పాతకాలం నాటి వామనగుంటల ఆట. దీన్నే ఓమన గుంటలు, ఒనగండ్లు, బద్దీలాట... అని కూడా అంటారు.

Updated : 06 May 2024 15:26 IST

ఆటలు పిల్లలకు సరదా, సంతోషాన్ని ఇవ్వడంతో పాటు కొన్ని మోటార్‌ స్కిల్స్‌నీ అలవరచాలి. అలాంటిదే పాతకాలం నాటి వామనగుంటల ఆట. దీన్నే ఓమన గుంటలు, ఒనగండ్లు, బద్దీలాట... అని కూడా అంటారు. ఈ ఆట ఆడేందుకు వాడే బోర్డు షాపుల్లో దొరుకుతుంది. కాదనుకుంటే నేలపై సుద్ద ముక్కతో రెండు వరుసల్లో ఒక్కో దానిలో ఏడు చొప్పున గళ్లను గీసి దాన్ని ఆడాలి.

ఇద్దరు ఆడే ఈ ఆట కోసం గవ్వలు, చింతగింజలు వాడతారు. ఒక్కో గుంటలో ఐదు గవ్వలు చొప్పున వేస్తూ ఆట మొదలుపెడతారు. అయ్యాక నచ్చిన గుంటలోని గవ్వల్ని తీసుకుని కుడి చేతి మీదుగా ఒక్కో గుంటలో ఒక్కో గవ్వా వేస్తూ... అన్నింటిలోనూ పంచుతారు.  చేతిలో ఉన్నవి అయిపోతే ఆ తరవాత గుంటలో నుంచి తీసుకుని వేయాలి. ఎక్కడైనా మధ్యలో ఖాళీ వచ్చిందంటే... దాని తరవాత గుంటలో ఉన్న గవ్వలు పంచిన వ్యక్తికి చెందుతాయి. ఇలా ఒకరి తరవాత మరొకరు ఆడాలి. చివరికి ఎవరి దగ్గర ఎక్కువ గవ్వలు ఉంటే వారే గెలిచినట్లు. ఈ ఆటను నిశితంగా గమనించడం, ఒక్కో గవ్వా లెక్క తప్పకుండా, ఖాళీ రాకుండా చూసుకుంటూ పంచడం వంటివి మెదడుకి పదును పెడతాయి. ఏకాగ్రత పెంచుతాయి.

ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్