నాడు స్టాలిన్‌.. నేడు పుతిన్‌

దక్షిణ ఉక్రెయిన్‌లోని ఓడరేవు నగరాలే లక్ష్యంగా రష్యా సాగిస్తున్న దాడులు శనివారం రాత్రి, ఆదివారమూ కొనసాగాయి. ముఖ్యంగా ఒడెసా నగరంలోని నౌకాశ్రయ మౌలిక వ్యవస్థలపై మాస్కో గురిపెడుతూ క్షిపణుల వర్షం కురిపించింది.

Published : 24 Jul 2023 03:45 IST

ఒడెసాలోని ప్రముఖ చర్చిని ధ్వంసం చేసిన రష్యా

ఒడెసా: దక్షిణ ఉక్రెయిన్‌లోని ఓడరేవు నగరాలే లక్ష్యంగా రష్యా సాగిస్తున్న దాడులు శనివారం రాత్రి, ఆదివారమూ కొనసాగాయి. ముఖ్యంగా ఒడెసా నగరంలోని నౌకాశ్రయ మౌలిక వ్యవస్థలపై మాస్కో గురిపెడుతూ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఒకరు చనిపోయారు. 22 మంది గాయపడ్డారు. ఒడెసాలోని ప్రధాన చర్చికి తీవ్ర నష్టం వాటిల్లింది. 1794లో నిర్మించిన ఈ పురాతన చర్చి 1934లో స్టాలిన్‌ కారణంగా ధ్వంసమైంది. తర్వాత పునర్నిర్మించారు. ఇప్పుడు పుతిన్‌ దళాలు దాడి చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని