Israel- Hamas: ఇజ్రాయెల్‌ దాడుల్లోనే.. 13 మంది బందీలు మృతి: హమాస్‌

గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో తమ వద్ద ఉన్న 13 మంది బందీలు మృతి చెందినట్లు హమాస్‌ వెల్లడించింది.

Published : 13 Oct 2023 14:40 IST

గాజా: ఇజ్రాయెల్‌ (Israel)పై మెరుపు దాడులకు దిగిన హమాస్‌ (Hamas) మిలిటెంట్లు.. విదేశీయులు సహా 150 మంది పౌరులను బందీలుగా తరలించుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారిని విడిపించుకునే దిశగా ఇజ్రాయెల్‌ ఇప్పటికే గాజా(Gaza)కు నీరు, విద్యుత్‌, ఇంధన సరఫరాలు నిలిపేసింది. గాజాపై భీకర వైమానిక దాడులు జరుపుతోంది. అయితే, ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో ఆయా చోట్ల దాదాపు 13 మంది బందీ (Hostages)లు మృతి చెందినట్లు హమాస్‌ ప్రకటించింది. వారిలో విదేశీయులు కూడా ఉన్నట్లు వెల్లడించింది.

ఇజ్రాయెల్‌ కాళ్లకు బందీల బంధనం!

‘గత 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులకు పాల్పడిన అయిదు ప్రాంతాల్లో విదేశీయులు సహా 13 మంది బందీలు మృతి చెందారు’ అని హమాస్‌ మిలిటరీ విభాగం వెల్లడించింది. అయితే, వారి జాతీయతను వెల్లడించలేదు. ఇజ్రాయెల్‌ సైతం ఈ ప్రకటనపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. బందీలను విడిపించుకునేందుకుగానూ ఇజ్రాయెల్‌ ప్రస్తుతం గ్రౌండ్‌ ఆపరేషన్‌కు సిద్ధమవుతోన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పాలస్తీనా పౌరులు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని వీడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలను ఐరాస ఖండించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని