Lok Sabha Elections: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి ఈ లోక్‌సభ ఎన్నికలు

ప్రజాస్వామ్య పండగగా భావించే సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) సమరంలో వివిధ రూపాల్లో రూ.వేల కోట్లు ఖర్చవుతుంది. నిపుణుల అంచనా ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా రూ.1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా. 

Updated : 26 Apr 2024 13:16 IST

ప్రజాస్వామ్య పండగగా భావించే సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) సమరంలో వివిధ రూపాల్లో రూ.వేల కోట్లు ఖర్చవుతుంది. నిపుణుల అంచనా ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా రూ.1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా. అమెరికాకు చెందిన ఓపెన్‌సీక్రెట్స్‌ సంస్థ ప్రకారం 2020 అమెరికా ఎన్నికల వ్యయం (రూ.1.2 లక్షల కోట్లు)ను ఇది దాటిపోనుంది. దేశంలో మొత్తం ఓటర్లు 96.6 కోట్ల మంది కాగా.. ఒక్కో ఓటరుకు రూ.1,400 ఖర్చు చేస్తున్నారన్నమాట. అంతేకాకుండా 2019లో అయిన రూ.60 వేల కోట్లతో పోలిస్తే ఈసారి రెట్టింపు కంటే ఎక్కువ కానుండటం గమనార్హం.

Tags :

మరిన్ని