YSRCP: ఆలయంలోకి అనుమతించం: వైకాపా ఎమ్మెల్యేకు కార్యకర్తల నుంచి నిరసన సెగ

కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి.. సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ ఎదురైంది. గ్రామంలోని సూర్యనారాయణస్వామి ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేను ఆలయంలోకి అనుమతించబోమంటూ.. స్థానిక వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. స్వామి ఉత్సవంలో భాగంగా పలు క్రీడలకు పోలీసుల అనుమతి తీసుకురావడంలో విఫలమయ్యారంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 01 Feb 2023 19:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు