Hyderabad: జూబ్లీహిల్స్‌లో బెంజ్‌ కారు బీభత్సం

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 10లో ఓ బెంజ్‌ కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్ నుంచి పార్క్ హయత్‌కి వెళ్తున్న కారు అదుపుతప్పి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లింది.

Updated : 24 Apr 2024 11:16 IST

Hyderabad: జూబ్లీహిల్స్‌లో బెంజ్‌ కారు బీభత్సం

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 10లో ఓ బెంజ్‌ కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్ నుంచి పార్క్ హయత్‌కి వెళ్తున్న కారు అదుపుతప్పి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో యువతి సహా వెంకటేశ్‌, అవినాష్‌ అనే ఇద్దరు యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎయిర్‌ బెలూన్స్‌ తెరచుకోవడం వల్ల ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. ఉదయం 3.15 గంటలకు ఘటన జరిగి ఉండొచ్చని, మద్యం తాగి కారు నడపడం వల్లే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు అనుమాస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

మరిన్ని