Adani : ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టిన ఆదాని
ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ సంపన్నుడు గౌతమ్ అదానీ నాలుగో స్థానానికి చేరుకున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకారు. అదానీ సంపద 114 బిలియన్ డాలర్లు ఉన్నట్సు ఫోర్బ్స్ అంచనా వేసింది. ఐదో స్థానానికి చేరిన బిల్ గేట్స్ సంపద 102 బిలియన్ డాలర్లు ఉన్నట్లు పేర్కొంది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 230 బిలియన్ డాలర్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ , మూడో స్థానంలో జెఫ్ బెజోస్ ఉన్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పదో స్థానంలో కొనసాగుతున్నారు.
Published : 19 Jul 2022 17:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం