Adani : ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టిన ఆదాని

ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ సంపన్నుడు  గౌతమ్ అదానీ నాలుగో స్థానానికి చేరుకున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో  మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకారు. అదానీ  సంపద 114 బిలియన్ డాలర్లు ఉన్నట్సు ఫోర్బ్స్ అంచనా వేసింది. ఐదో స్థానానికి చేరిన బిల్ గేట్స్ సంపద 102 బిలియన్ డాలర్లు ఉన్నట్లు పేర్కొంది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 230 బిలియన్ డాలర్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ , మూడో స్థానంలో జెఫ్ బెజోస్ ఉన్నారు. రిలయన్స్  అధినేత ముఖేశ్ అంబానీ పదో స్థానంలో కొనసాగుతున్నారు.

Published : 19 Jul 2022 17:31 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని