NPCI: డిజిటల్‌ చెల్లింపుల్లో ఫోన్‌పే, గూగుల్‌పేకు చెక్‌పెట్టేలా ఎన్‌పీసీఐ చర్యలు

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థల ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిద్ధమైంది. దేశీయంగా ఫోన్‌పే, గూగుల్‌పే ఆధిపత్యం కొనసాగుతుండగా మొన్నటివరకు పోటీలో ఉన్న పేటీఎం.. ఆర్బీఐ ఆంక్షలతో చతికిలపడింది. దీంతో యూపీఐ లావాదేవీల్లో విలువపరంగా ఆ రెండే 86 శాతం వాటా కలిగి ఉన్నాయి. వాటి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు క్రెడ్, ఫ్లిప్ కార్ట్, జొమాటో, అమెజాన్ ఇతర ఫిన్‌టెక్ సంస్థలతో ఎన్‌పీసీఐ ప్రతినిధులు భేటీ కానున్నారు.  మొత్తం యూపీఐ లావాదేవీల పరిమాణంలో ఒక థర్డ్ పార్టీ యాప్‌నకు 30 శాతానికి మించిన వాటా ఉండరాదని ఎన్‌పీసీఐ పరిమితి విధించింది. ఈ నేపథ్యంలో ఎన్‌పీసీఐ చర్యలకు సిద్ధమైంది.

Published : 18 Apr 2024 10:47 IST

Tags :

మరిన్ని