AP News: పింఛనుదారులను ఇబ్బందిపెట్టేలా ప్రభుత్వం మరో కుట్ర!

ఇంటింటికీ పింఛన్ల పంపిణీ విషయంలో వైకాపా ప్రభుత్వ తీరు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న రీతిలో ఉంది. లబ్ధిదారులందరికీ ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయడం కుదరదంటోంది.

Published : 30 Apr 2024 09:26 IST

మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసినా.. రెండు రోజుల్లోనే పంపిణీ పూర్తవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరక దాన్ని పక్కనపెట్టింది వైకాపా ప్రభుత్వం. ఈసారి మరింత కష్టపెట్టే వ్యూహాన్ని రచించింది. అందుకే మొదట ఏ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానమైందో తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్లి, ఆ తర్వాత దూరాన ఉండే బ్యాంకుకు వెళ్లి జనం ఇక్కట్లు పడేలా నిర్ణయం తీసుకుంది. ఇదీ పింఛనుదారుల పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న కర్కశ వైఖరి.

Tags :

మరిన్ని