Eluru: ఓటర్లకు ఆహ్వాన పత్రిక.. అధికారుల వినూత్న ప్రచారం

ఇంట్లో ఏ శుభకార్యమైనా ఆహ్వాన పత్రికతో బంధుమిత్రుల్ని ఆహ్వానిస్తాం. అదే విధంగా ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగైన ఎన్నికల్లో ప్రతిఒక్కరూ పాల్గొనేలా ఏలూరు జిల్లా యంత్రాంగం వినూత్న ప్రచారం చేపట్టింది. రండి.. ఓటు హక్కు వినియోగించండి.. అంటూ ఆహ్వాన పత్రికలు ముద్రిస్తోంది. ఉద్యోగ, వ్యాపార, చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారంతా పోలింగ్ రోజున వచ్చేలా ఆహ్వానం పంపేందుకు సిద్ధమైంది. ఓటింగ్ శాతాన్ని పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రచారానికి మంచి స్పందన వస్తోందని ఏలూరు జిల్లా స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.

Published : 21 Mar 2024 15:26 IST

Tags :

మరిన్ని