RBI: రెపోరేటు మరో 35 బేసిస్‌ పాయింట్లు పెంచిన ఆర్బీఐ

వాణిజ్య వర్గాలు, విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఈసారి వడ్డీ రేట్లను 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపోరేటు 6.25 శాతానికి చేరింది. సోమవారం ప్రారంభమైన ద్రవ్య పరపతి కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేడు ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించడం, ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో రేట్ల పెంపు వేగాన్ని ఈసారి ఆర్‌బీఐ కాస్త తగ్గించింది. తాజా పెంపుతో అన్ని రకాల రుణాలు మరింత భారం కానున్నాయి.

Published : 07 Dec 2022 15:35 IST

Tags :

మరిన్ని