AP Capital: ఏపీ రాజధాని కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే నిరాకరణ

రాజధాని(AP Capital) కేసులపై సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ జులై 11కు వాయిదాపడింది. రాజధాని అంశంపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు సెలవులతోపాటు ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ జూన్ 17న పదవీవిరమణ చేస్తున్నందున.. సుదీర్ఘ వాదనలు విని తీర్పురాసేంత సమయం ఉండదంటూ కేసు విచారణను జులై 11కు వాయిదా వేసింది.

Published : 29 Mar 2023 10:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు