Viral Video: ఒక్కసారిగా దూసుకొచ్చిన పులి.. పర్యాటకుల్లో వణుకు!

ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌ (Jim Corbett National Park)లో సఫారీకి వెళ్లిన కొందరు పర్యాటకులకు.. భయానక ఘటన ఎదురైంది. పార్క్‌లో వన్యప్రాణుల్ని చూస్తూ వాహనంలో ముందుకు వెళ్తున్న వారికి.. ఓ చోట పొదల్లో నుంచి పులి (Tiger) ప్రత్యక్షమైంది. దీంతో సఫారీ డ్రైవర్ కాసేపు వాహనాన్ని అక్కడే నిలిపివేశాడు. పర్యాటకులు పులిని వీడియో తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో చిరాకుకు గురైన పులి బిగ్గరగా గాండ్రిస్తూ సఫారీ జీపు వైపు దూసుకొచ్చింది. దీంతో పర్యాటకులు భయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని వెంటనే అక్కడి నుంచి పోనివ్వడంతో ప్రమాదం తప్పింది.

Updated : 27 Apr 2023 16:15 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు