NagarKurnool: కొల్లాపూర్‌లో పెద్దపులి కలకలం

నాగర్‌కర్నూల్ జిల్లాలో పులి (Tiger) సంచారం కలకలం రేపుతోంది. కొల్లాపూర్ మండలం అమరగిరి సమీపంలోని కోతిగుండుపొదలో దాగి ఉన్న పెద్దపులిని గమనించకుండా మేకలను మేత కోసం యజమాని తీసుకెళ్లాడు. సమీపంలోని పులి.. మేకను వేటాడి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూగజీవాల యజమానులు పశుగ్రాసం కోసం కృష్ణానదీ తీరానికి మేకలు, పశువులను తీసుకెళ్తుంటారు. మేకను పులి చంపడంతో భయాందోళనకు గురైన యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.  

Updated : 12 Dec 2023 10:45 IST

Tags :

మరిన్ని