TS News: అన్నదాతలను నట్టేట ముంచిన అకాల వర్షం

అకాల వర్షం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అన్నదాతలను నట్టేట ముంచింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వడగళ్ల వానకు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండల వ్యాప్తంగా భారీ వర్షం పడటంతో.. కోతకు వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. అలాగే డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండలోనూ అకాల వర్షానికి రైతులు కుదేలయ్యారు. చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. వేలకు వేలు పెట్టుబడి పెట్టిన కర్షకులు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. కిందటి ఏడాది ఇలానే వర్షాలు పడి నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. మరోవైపు వడగండ్ల వానతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Published : 16 Mar 2024 23:47 IST

Tags :

మరిన్ని