ఎంబ్రాయిడరీ ‘చిత్రాలు’

ఇక్కడ కనిపిస్తున్న సచిన్‌ తెందుల్కర్‌, చిన్నారి బాబు, నవ వధువు, ప్రకృతి దృశ్యపు చిత్రాల్ని అదాటున చూసినవారెవరైనా సరే ‘ఆర్టిస్టు ఎవరోగానీ భలేగా గీశారే’ అని మెచ్చుకుంటారు. కానీ అవన్నీ

Published : 08 May 2022 01:31 IST

ఎంబ్రాయిడరీ ‘చిత్రాలు’

ఇక్కడ కనిపిస్తున్న సచిన్‌ తెందుల్కర్‌, చిన్నారి బాబు, నవ వధువు, ప్రకృతి దృశ్యపు చిత్రాల్ని అదాటున చూసినవారెవరైనా సరే ‘ఆర్టిస్టు ఎవరోగానీ భలేగా గీశారే’ అని మెచ్చుకుంటారు. కానీ అవన్నీ మామూలు చిత్రాలు కావు, ‘ఎంబ్రాయిడరీ పోర్ట్రెయిట్స్‌’ అని తెలియగానే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన అస్మితా పోత్‌దార్‌ అనే ఆర్టిస్టు సూదీ, రంగుల దారాలతో ఈ చిత్రాలన్నింటినీ కుట్టింది. చిన్నప్పుడు అమ్మ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్‌ నేర్చుకున్న అస్మిత దాన్నే కళగా మార్చుకుని ఇలా దారపు పోగులతో ముచ్చటైన చిత్రాలకు ప్రాణం పోస్తోంది. కాన్వాసు మీద ముందుగా బొమ్మ గీసుకుని ఆ తర్వాత కళ్లూ, ముక్కూ, దుస్తులూ ఇలా అన్నీ నిజమైన వాటిలా కనిపించేలా... ఆ ఆకారం సరిగ్గా వచ్చేలా... రంగుల దారాలతో నెమ్మదిగా బొమ్మల్ని కుట్టేస్తుంది. వస్త్రం పైన చిన్న చిన్న పువ్వులూ, లతల డిజైన్ల ఎంబ్రాయిడరీ వేయడం వేరుగానీ ఇలా అచ్చంగా ఫొటోల్లా కనిపించే చిత్రాల్ని వేయడమంటే గొప్ప విషయమే కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..