విదేశాలకు విహార నౌకలు

విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకల సర్వీసులు ప్రారంభించే దిశగా నౌకాశ్రయం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఏడాదిలో పూర్తి చేయాలి. ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ

Updated : 28 Nov 2021 05:34 IST

విశాఖ నుంచి తొలుత సింగపూర్‌, శ్రీలంకకు..

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకల సర్వీసులు ప్రారంభించే దిశగా నౌకాశ్రయం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఏడాదిలో పూర్తి చేయాలి. ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ విహార నౌకలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. దేశంలోని ముంబయి, కొచ్చి, గోవా, మంగళూరు, చెన్నై తదితర నౌకాశ్రయాలకు అంతర్జాతీయ విహార నౌకలు వస్తుంటాయి. ఆయా సర్వీసులు నడిపే సంస్థల ప్రతినిధులతో మాట్లాడి విశాఖకు కూడా విదేశీ పర్యాటకులు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి వీలుగా సర్వీసులు ఉండేలా షిప్పింగ్‌ ఏజెంట్లు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అంతర్జాతీయ విహార నౌకలు ఐదు నక్షత్రాల హోటళ్లలోని సౌకర్యాలను అందిస్తాయి. రెస్టారెంట్లు, ఈత కొలను, ఇండోర్‌ గేమ్స్‌, థియేటర్లు, డాన్స్‌ ఫ్లోర్స్‌, తదితరాలన్నీ అందుబాటులో ఉంటాయి. ఇందులో 2 వేల మంది వరకు ప్రయాణించవచ్చు.  


ఇదో మైలురాయి
- కె.రామమోహనరావు, ఛైర్మన్‌, విశాఖ నౌకాశ్రయం

విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్‌ టెర్మినల్‌ అందుబాటులోకి రానుండడం రాష్ట్ర పర్యాటక రంగంలో మైలురాయి. విశాఖ నౌకాశ్రయం, కేంద్ర నౌకాయాన, పర్యాటక శాఖల భాగస్వామ్యంతో క్రూయిజ్‌ టెర్మినల్‌ ఏర్పడుతోంది. నిర్వహణకు అవసరమైన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. విశాఖకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు రావడానికి టెర్మినల్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.


సరికొత్తగా అంతర్జాతీయ విహారం

అంతర్జాతీయ విహారాలతో పాటు విశాఖ నుంచి సమీపంలోని తీర నగరాలకు దేశీయ క్రూయిజ్‌ ప్రయాణాలను నిర్వహించుకోవచ్చు. గోవా-ముంబయి మధ్య నిర్వహిస్తున్న దేశీయ క్రూయిజ్‌ విహారం విజయవంతంగా నడుస్తోంది. అలాగే అంతర్జాతీయంగా డిమాండు గణనీయంగా పెరుగుతోంది. నౌక ప్రయాణ మార్గంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పర్యాటకులు ప్రయాణించవచ్చు.  

- కల్యాణ్‌, ఆపరేషన్స్‌ మేనేజర్‌, ఇంచ్‌కేప్‌ షిప్పింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని