ఎన్టీఆర్‌ ట్రస్టు ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఎన్టీఆర్‌ ఉన్నత పాఠశాలలో 40మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి

Published : 04 Jul 2022 04:58 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఎన్టీఆర్‌ ఉన్నత పాఠశాలలో 40మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. 6, 7, 8, 9 తరగతుల్లో ఒక్కో తరగతికి 10 మంది చొప్పున ఉచిత విద్య అందించాలని నిర్ణయించినట్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 9లోగా పాఠశాల హెచ్‌ఎంను కలిసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు ఎక్కువ వస్తే జులై 10న పాఠశాల ప్రాంగణంలో ప్రతిభా పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని