పార్లమెంటు ప్రాంగణంలో ఎన్టీఆర్‌కు నివాళులు
తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటు ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, డీఎంకే ఎంపీలు తమిళిసై తంగపాండియన్ (సుమతి), కళానిధి వీరస్వామి, ఆర్‌ఎస్పీ ఎంపీ ప్రేమ్‌చంద్రన్, తెదేపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి సత్యనారాయణ బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈనాడు, దిల్లీ: తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటు ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, డీఎంకే ఎంపీలు తమిళిసై తంగపాండియన్ (సుమతి), కళానిధి వీరస్వామి, ఆర్‌ఎస్పీ ఎంపీ ప్రేమ్‌చంద్రన్, తెదేపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి సత్యనారాయణ బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ సుమతి కేక్ కోశారు. అనంతరం ఎంపీలు జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్, తెదేపా పాత్రపై మాట్లాడారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న భాజపా అధ్యక్షుడు నడ్డా తెదేపా ఎంపీలను పలుకరించి తెదేపా ఆవిర్భావ దినోత్సవం విషయం తెలుసుకొని శుభాభినందనలు తెలిపారు.
తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు
ఈనాడు డిజిటల్, అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి తెదేపా ఘన చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. ‘‘నేడు జగన్ విధ్వంస పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. చంద్రబాబును సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’’ అని పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. పార్టీ నేతలు హాజీ షేక్ హసన్‌బాషా, బొద్దులూరి వెంకటేశ్వరరావు, సత్యవాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్.. మండిపడ్డ సాక్షి మాలిక్
-
Crime News
Kurnool: భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య
-
Sports News
Dhoni - CSK: ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్’ ధోనీకి వర్తించదట.. కారణం చెప్పిన సెహ్వాగ్!
-
India News
IAF: వాయుసేన అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
-
Sports News
Sachin - Gill: గిల్లో ఆ లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి: సచిన్
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’.. వాళ్లు కచ్చితంగా చూడాల్సిన చిత్రం: కృతి సనన్