Junior Lineman: పెద్ద మనసు లేని మంత్రి పెద్దిరెడ్డి

డిస్కమ్‌లో జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌-2 ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద మనసు లేదని గ్రామ, వార్డు జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌-2 కార్యదర్శుల అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పుల్లగుమ్మిరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 11 Jul 2023 09:21 IST

జూనియర్‌ లైన్‌మెన్‌ల ఆవేదన

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: డిస్కమ్‌లో జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌-2 ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద మనసు లేదని గ్రామ, వార్డు జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌-2 కార్యదర్శుల అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పుల్లగుమ్మిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నియమితులైన తమకు సచివాలయ పరిధిలో విధులు కేటాయించకుండా, డిస్కమ్‌లో లేని క్యాడర్‌ను తీసుకొచ్చి జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌-2గా వినియోగించుకుంటున్నారని తెలిపారు. అనధికారికంగా ఇంధన సహాయకులుగా పనులు చేయించుకోవడం ద్వారా 120 మంది మరణించారని, 250 మంది గాయపడి దివ్యాంగులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారిలో 80 శాతం యువత ఉండటంతో చిన్నవయసులో భర్తను కోల్పోయిన వారున్నారని, అయినా విద్యుత్తు శాఖామంత్రి, రాష్ట్ర డిస్కమ్‌ల సీఎండీలు, ఉన్నతాధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. అనంతరం ఆగస్టు 10వ తేదీన విజయవాడ వేదికగా ‘కన్నీటితో కాళ్లు కడిగితే కనికరం పుట్టేనా’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని