AP Roads: నమ్మండి.. ఇది ఆర్‌అండ్‌బీ రోడ్డే!

పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో వినుకొండ నుంచి నాగులవరం మీదుగా అద్దంకి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.

Updated : 14 Dec 2023 09:29 IST

వినుకొండ రూరల్‌, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో వినుకొండ నుంచి నాగులవరం మీదుగా అద్దంకి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. స్థానిక నేతలు రెండు రోజుల క్రితం మట్టి తోలి ఈ గుంతలను కొంతమేర పూడ్చారు. కానీ లోతు గుంతలు కావడంతో భారీ వాహనాలు మట్టిలో కూరుకుపోతున్నాయి. బుధవారం నాగులవరం వద్ద లారీ, ట్రాక్టరు మట్టిలో దిగబడి ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. గత నెల 19న, ఈ నెల 8న గోనుగుంట్లవారిపాలెం సమీపంలో ఆర్టీసీ బస్సు కమానుకట్టలు విరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారికి మరమ్మతులు చేయాలని, లేదా కొత్త రోడ్డు వేయాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని