పోలీసులకు ఓటుహక్కు విషయంలో వివరాలు సమర్పించండి

మహారాష్ట్రలో ఎన్నికల విధుల్లో ఉన్న ఏపీఎస్పీ పోలీసులు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

Published : 10 May 2024 05:24 IST

ఈసీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: మహారాష్ట్రలో ఎన్నికల విధుల్లో ఉన్న ఏపీఎస్పీ పోలీసులు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. వివరాలు సమర్పించేందుకు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల విధుల్లో భాగంగా మహారాష్ట్ర వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందకు వెసులుబాటు కల్పించలేదంటూ మంగళగిరికి చెందిన భిక్షమయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎస్‌.ప్రణతి వాదనలు వినిపించారు. ఈసీ తరఫు న్యాయవాది సత్యశివ దర్శిన్‌ స్పందిస్తూ.. విధులు నిర్వహించే ప్రదేశంలోనే పోలీసులు తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. దీంతో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు