PAN Aadhaar Link: ఆధార్‌-పాన్‌ లింక్‌.. ఐటీ శాఖ కీలక ప్రకటన

ఆధార్‌-పాన్‌ లింక్‌ కోసం చెల్లింపులు చేసిన తర్వాత లావాదేవీ పూర్తైతే చలాన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆదాయపన్ను శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 

Updated : 01 Jul 2023 08:02 IST

దిల్లీ: ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి (PAN Aadhaar Link) సంబంధించి గడువు శుక్రవారంతో ముగిసిన వేళ ఆదాయపన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. ఆధార్‌-పాన్‌ లింక్‌ కోసం చెల్లింపులు చేసిన తర్వాత చలాన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో కొంతమంది యూజర్లు సమస్యను ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో చలాన్‌ కోసం చెల్లింపులు చేసిన తర్వాత ఐటీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ చేసి ఈ-పే ట్యాక్స్‌ సెక్షన్‌లో చెల్లింపు పూర్తయిందా? లేదా? అనేది తెలుసుకోవచ్చని సూచించింది. అందులో లావాదేవీలు పూర్తయినట్లు చూపిస్తే ఆధార్‌-పాన్‌ లింక్‌ చేసుకోవచ్చని తెలిపింది. అలానే, పాన్‌-ఆధార్‌ లింక్‌ కోసం చలాన్‌ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. చెల్లింపు పూర్తయిన తర్వాత పాన్‌కార్డు హోల్డర్స్ రిజిస్టర్డ్‌ ఈ-మెయిల్‌కు చలాన్‌ చెల్లింపులకు సంబంధించిన రశీదు కాపీ వస్తుందని వెల్లడించింది. ఒకవేళ నగదు చెల్లింపు పూర్తయిన తర్వాత ఆధార్‌-పాన్‌ లింక్‌ ప్రక్రియ పూర్తి కాకపోతే అలాంటి వాటిని ఆదాయపన్ను శాఖ పరిగణలోకి తీసుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని