Jio 5G: అన్ని సర్కిళ్లలో 5జీ సేవలు.. ప్రభుత్వానికి తెలిపిన జియో

Jio 5G in alll circles: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జియో ప్రభుత్వానికి వెల్లడించింది.

Published : 03 Aug 2023 17:06 IST

దిల్లీ: దేశంలో 5జీ సర్వీసులను వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్‌ జియో (Reliance Jio) కొత్త మైలురాయిని అందుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లలో 5జీ సేవలను (Jio 5g) అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇదే విషయాన్ని జియో ప్రభుత్వానికి తెలియజేసింది. నిర్దేశిత పారామీటర్లు అందుకోవడానికి ఉద్దేశించిన టెస్టింగ్‌కు తాము సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు టెలికాం విభాగానికి సమాచారం అందించింది.

ఇలా అన్ని సర్కిళ్లలో 5జీ సేవలు ప్రారంభించినట్లు జియో వెల్లడించిన నేపథ్యంలో టెలికాం విభాగానికి టర్మ్‌ సెల్స్‌ (డాట్‌ సబార్డినేట్‌ ఆఫీసులు) 10 శాతం సైట్లను టెస్టింగ్‌కు ఎంచుకుంటాయి. అన్ని పారామీటర్లలో విజయవంతం అయితే అన్ని సర్కిళ్లలో 5జీ సేవలను తీసుకొచ్చినట్లు ఓ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. మరోవైపు వేలంలో దక్కించుకున్న 26 GHz, 3,300 MHz స్పెక్ట్రమ్‌ బ్యాండ్స్‌ను గుజరాత్ సర్కిల్‌ జియో విజయవంతంగా పరీక్షించింది. 

ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల దిగుమతులపై.. కేంద్రం ఆంక్షలు

దేశంలో గతేడాది అక్టోబర్‌లో 5జీ సేవలు ప్రారంభం కాగా.. టెలికాం కంపెనీలు వేగంగా తమ సేవలను విస్తరిస్తున్నాయి. ఈ విషయంలో ప్రైవేటు రంగ కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌ పోటీ పడుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 2.81 లక్షల టవర్లను (బేస్‌ స్టేషన్‌ సబ్‌సిస్టమ్‌) ఏర్పాటు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి దేవు సిన్హ్‌ చౌహాన్‌ ఇటీవల లోక్‌సభలో వెల్లడించారు. కంపెనీ వారీగా చూస్తే.. జియో 2.28 లక్షల టవర్లను ఏర్పాటు చేయగా.. ఎయిర్‌టెల్‌ 53 వేల టవర్లను ఏర్పాటు చేసింది. వొడాఫోన్‌ ఐడియా కేవలం 36 మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని