Flipkart: ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ యాడ్‌.. ఫ్లిప్‌కార్ట్‌, అమితాబ్‌పై కాయిట్‌ ఫిర్యాదు

CAIT files complaint against Flipkart: బిగ్‌ బిలియన్‌ డేస్‌కు సంబంధించిన ఓ యాడ్‌ వివాదాస్పదమైంది. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కాయిట్‌ ఫిర్యాదు చేసింది.

Published : 03 Oct 2023 22:35 IST

దిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart), బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌పై కేంద్రానికి ట్రేడర్స్‌ సమాఖ్య కాయిట్‌- కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (CAIT) ఫిర్యాదు చేసింది. రాబోయే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌కు (Big Billion Days sale) సంబంధించి ఇచ్చిన ప్రకటన ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖకు పరిధిలోని కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీకి (CCPA) ఫిర్యాదు చేసింది. 

దేశంలో ఉన్న చిన్న రిటైలర్లను దెబ్బతీసేవిధంగా ఉన్న సదరు అడ్వర్టైజ్‌మెంట్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కాయిట్‌ కోరింది. తప్పుదోవ పట్టించేలా ప్రకటన ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్‌కు, ఆ ప్రకటనలో నటించిన అమితాబ్‌కు జరిమానా విధించాలని కోరింది. బిగ్‌ బిలియన్‌ డే సేల్‌కు సంబంధించి ఇటీవల అమితాబ్‌ నటించిన ఓ అడ్వర్టైజ్‌మెంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రదర్శించింది. బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌లో మొబైల్‌ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తాయని, దేశంలోని ఏ రిటైల్‌ స్టోర్లలోనూ ఇంత చౌకగా లభించవన్నది ఆ ప్రకటన సారాంశం. దీనిపై కాయిట్ అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. అక్టోబర్‌ 8 నుంచి 15 వరకు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు