Credit Score: మెరుగైన క్రెడిట్ స్కోరుతో తక్కువకే రుణాలు.. ఈ టేబుల్ చూడండి..
క్రెడిట్ స్కోరును బట్టి బ్యాంకులు రుణ మంజూరులో నిర్ణయాలు తీసుకుంటాయి. స్కోరును బట్టి బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎలా మారతాయో ఇక్కడ చూడండి.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్‌బీఐ (RBI) రెపోరేట్లు పెంచిన ప్రతిసారీ బ్యాంకులు గృహరుణ (Home loan) వడ్డీ రేట్లు పెంచుతుంటాయి. అయితే, బ్యాంకులు గృహ రుణాలు మంజూరు చేసేటప్పుడు వడ్డీ రేటు క్రెడిట్ స్కోరు (Credit score) ఆధారంగా నిర్ణయిస్తాయి. బ్యాంకులు మెరుగైన క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉన్న వినియోగదారులకు ప్రాధాన్యం ఇస్తాయి. మంచి క్రెడిట్ స్కోరు అనేది డిఫాల్ట్‌కు అవకాశం లేదని బ్యాంకులకు హామీ ఇస్తుంది.
క్రెడిట్ స్కోరు అంటే..?
క్రెడిట్ స్కోరు మీ మొత్తం క్రెడిట్ చరిత్రను వివరించే మూడు అంకెల సంఖ్య. క్రెడిట్ స్కోరు విలువ సాధారణంగా 300-900 మధ్య ఉంటుంది. అధిక క్రెడిట్ స్కోరు సాధారణంగా మీరు తక్కువ రిస్క్ ఉన్న రుణగ్రహీత అని సూచిస్తుంది. దీంతో తక్కువ వడ్డీ రేటుతో రుణం లభిస్తుంది. తక్కువ క్రెడిట్ స్కోరు.. రుణం తిరస్కరణకు లేదా అధిక వడ్డీ రేటుకు దారి తీస్తుంది. ఇది మీ నెలవారీ ఈఎంఐ చెల్లింపులను మరింత ఖరీదవుతుంది. అందువల్ల మంచి క్రెడిట్ స్కోరును నిర్వహించడం చాలా అవసరం. ఎందుకంటే ఇది వడ్డీరేటును గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
మంచి క్రెడిట్ స్కోరు
650, ఇంతకంటే ఎక్కువ స్కోరు మీరు రుణం పొందడానికి సహాయపడుతుంది. మీ స్కోరు 750 కంటే ఎక్కువ ఉంటే మీరు త్వరగా రుణం పొందడమే కాకుండా వడ్డీ రేట్లు కూడా తక్కువ స్థాయిలో ఉంటాయి. మీరు గృహ రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు, బ్యాంకు క్రెడిట్ ఏజెన్సీల నుంచి మీ క్రెడిట్ స్కోరును పొందుతాయి. మీ ఆదాయం, ఉపాధి మొదలైన ఇతర విషయాలతో పాటు మీ చెల్లింపుల చరిత్రను క్రెడిట్ ఏజెన్సీలు తనిఖీ చేస్తాయి.
క్రెడిట్ స్కోరును బట్టి రుణాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులుంటాయో ఈ కింది పట్టికలో చూడండి.
గమనిక: ఈ డేటా 2023 ఫిబ్రవరి 7 నాటిది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dhoni-IPL: ఐపీఎల్ 2023 తర్వాత ధోనీ రిటైర్ అవుతాడా? చాట్‌జీపీటీ సమాధానం ఇదే..
-
Politics News
D Srinivas: సొంతగూటికి డీఎస్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Malla Reddy: నన్ను పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా అడిగారు: మల్లారెడ్డి
-
Politics News
Vundavalli Sridevi: జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
-
Movies News
NTR: ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ సర్ప్రైజ్ గిఫ్ట్ .. తనకూ కావాలని కోరిన తారక్