IPO: రూ.664 కోట్ల సమీకరణ లక్ష్యంతో 2 ఐపీఓలు ప్రారంభం

IPO: రూ.235.32 కోట్ల సమీకరణ లక్ష్యంతో ప్లాటినం ఇండస్ట్రీస్‌.. రూ.429 కోట్ల నిధుల కోసం ఎగ్జికామ్‌ టెలీ-సిస్టమ్స్‌ ఐపీఓలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

Published : 27 Feb 2024 12:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పీవీసీ స్టెబిలైజర్ల తయారీ సంస్థ ప్లాటినం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఐపీఓ (Platinum Industries IPO) మంగళవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 29 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ధరల శ్రేణిని రూ.162-171గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.235.32 కోట్లు సమీకరించనుంది. మదుపర్లు కనీసం రూ.14,877తో 87 షేర్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలి. రిటైల్‌ మదుపర్లకు 35 శాతం, అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు 50 శాతం, సంస్థాగతేతర మదుపర్లకు 15 శాతం షేర్లను కేటాయించారు. ఈ ఐపీఓలో (IPO) మొత్తం 1.38 కోట్ల కొత్త షేర్లను జారీ చేస్తున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎలాంటి వాటాలు అందుబాటులో లేవు. కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో లిస్టవుతాయి.

ప్లాటినం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ను 2016లో స్థాపించారు. పీవీసీ స్టెబిలైజర్లు, సీపీవీసీ అడిటివ్‌లు, ల్యూబ్రికెంట్లను తయారు చేస్తుంది. పీవీసీ పైపులు, ప్రొఫైళ్లు, ఫిట్టింగులు; ఎలక్ట్రికల్‌ వైర్లు, కేబుళ్లు; ఎస్‌పీసీ ఫ్లోర్‌ టైళ్లు, రిజిడ్‌ పీవీసీ ఫోమ్‌ బోర్డులు, ప్యాకేజింగ్‌ మెటీరియళ్లలో ఈ కంపెనీ ఉత్పత్తులను వినియోగిస్తారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో కంపెనీ తయారీ కేంద్రం ఉంది. జులై 2023 నాటికి ఈ సంస్థకు 12 పంపిణీ కేంద్రాలున్నాయి.

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • ఐపీఓ తేదీలు: ఫిబ్రవరి 27-29
  • ధరల శ్రేణి: రూ.162-171
  • షేరు ముఖ విలువ: రూ.10
  • కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 87 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.14,877
  • అలాట్‌మెంట్ తేదీ: మార్చి 1
  • రిఫండ్‌ తేదీ: మార్చి 4
  • లిస్టింగ్‌ తేదీ: మార్చి 5

ఎగ్జికామ్‌ టెలీ-సిస్టమ్స్‌ ఐపీఓ

ఎగ్జికామ్‌ టెలీ-సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ (Exicom Tele Systems IPO) సైతం ఈరోజే ప్రారంభమైంది. గురువారం వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ధరల శ్రేణిని రూ.135-142గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.429 కోట్లు సమీకరించనుంది. మదుపర్లు కనీసం రూ.14,200తో 100 షేర్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐపీఓలో మొత్తం రూ.329 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేస్తున్నారు. మరో రూ.100 కోట్లు విలువ చేసే 70.42 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తున్నారు. ఈ షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో లిస్టవుతాయి.

ఎగ్జికామ్‌ టెలీ-సిస్టమ్స్‌ లిమిటెడ్‌ను 1994లో స్థాపించారు. పవర్‌ సిస్టమ్స్‌, విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ సంబంధిత వసతులను కల్పిస్తోంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ భారత్ సహా ఆగ్నేయాసియాలో 61,000 డీసీ, ఏసీ ఛార్జర్లను ఏర్పాటు చేసింది. 2023 సెప్టెంబర్‌ నాటికి 15 ప్రముఖ వాహన తయారీ సంస్థలు దీనికి కస్టమర్లుగా ఉన్నాయి. 

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • ఐపీఓ తేదీలు: ఫిబ్రవరి 27-29
  • ధరల శ్రేణి: రూ.135-142
  • షేరు ముఖ విలువ: రూ.10
  • కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 100 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.14,200
  • అలాట్‌మెంట్ తేదీ: మార్చి 1
  • రిఫండ్‌ తేదీ: మార్చి 4
  • లిస్టింగ్‌ తేదీ: మార్చి 5

(గమనిక: ఐపీఓలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఐపీఓలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని