Galaxy S23 FE: శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ విడుదల.. 50MP కెమెరా, 4,500 బ్యాటరీ

Galaxy S23 FE: శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇది మొత్తం నాలుగు రంగులు, రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Published : 04 Oct 2023 11:50 IST

దిల్లీ: శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ (Galaxy S23 FE) స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచవ్యాప్తంగా బుధవారం విడుదలైంది. ఎస్‌23 తరహాలోనే వెనక వైపు ట్రిపుల్‌ కెమెరా సెట్‌, డిజైన్‌తో వస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ శాంసంగ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇది ఒకే వేరియంట్‌లో లభిస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ (Galaxy S23 FE) స్మార్ట్‌ఫోన్‌ ధర 599 డాలర్లు (దాదాపు రూ.49,800)గా ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. ఇది 8GB ర్యామ్‌ 128GB మెమొరీ, 8GB ర్యామ్‌ 256GB మెమొరీ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. క్రీమ్‌, పర్పుల్‌, గ్రాఫైట్‌, మింట్‌ రంగుల్లో ఇది లభిస్తుంది. అక్టోబర్‌ 26 నుంచి ఇది విక్రయానికి అందుబాటులోకి రానుంది. భారత్‌లో దీని ధర ఎంతో ఇంకా వెల్లడించలేదు.

6.3 అంగుళాల అమోలెడ్‌ ప్యానల్‌తో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే, ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌, స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 లేదా ఎక్సినోస్‌ 2200 చిప్‌సెట్‌ , 50 ఎమ్‌పీ+8 ఎమ్‌పీ+12 ఎమ్‌పీ కెమెరాలు, సెల్ఫీకి 10ఎమ్‌పీ కెమెరా, 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 25వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌ను దీనిలో వాడారు. బ్లూటూత్‌ 5.3, వైఫై 6ఈ, ఎన్‌ఎఫ్‌ఎస్‌, 5జీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని