విదేశాల్లోనూ యూపీఐ చెల్లింపులు

అంతర్జాతీయ ప్రయాణికులు సులభంగా చెల్లింపులు పూర్తి చేసేందుకు వీలుగా విదేశాల్లోనూ యూపీఐ సేవలను ప్రారంభించినట్లు ఫోన్‌పే వెల్లడించింది.

Published : 08 Feb 2023 01:52 IST

అందుబాటులోకి తెచ్చిన ఫోన్‌పే

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ ప్రయాణికులు సులభంగా చెల్లింపులు పూర్తి చేసేందుకు వీలుగా విదేశాల్లోనూ యూపీఐ సేవలను ప్రారంభించినట్లు ఫోన్‌పే వెల్లడించింది. ‘యూపీఐ ఇంటర్నేషనల్‌’ పేరుతో ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. ఫోన్‌పే వినియోగదారులు విదేశాల్లోని వ్యాపారులకు నేరుగా యూపీఐ ఆధారంగా చెల్లింపులు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్‌, మారిషస్‌, నేపాల్‌, భూటాన్‌ దేశాల్లో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, చెల్లింపు లావాదేవీని పూర్తి చేయొచ్చు. అంతర్జాతీయ డెబిట్‌ కార్డులను ఉపయోగించిన విధంగానే ఈ సేవలనూ వాడుకోవచ్చు. సాధారణంగా విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి కరెన్సీ లేదా క్రెడిట్‌, ఫారెక్స్‌ కార్డులతో చెల్లింపులు చేస్తారు. దీనికి బదులుగా భారతీయులు తమ బ్యాంకు ఖాతా నుంచి నేరుగా వ్యాపారులకు చెల్లించేలా ఇది తోడ్పడనుంది. ఈ ఏడాది ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌ మరిన్ని దేశాల్లో యూపీఐ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని