పొదుపు పథకాలకు పాన్‌, ఆధార్‌ తప్పనిసరి

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపు చేసేవారు ఇక నుంచి తమ ఆధార్‌, పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య) వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Published : 02 Apr 2023 01:40 IST

ఆర్థిక శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపు చేసేవారు ఇక నుంచి తమ ఆధార్‌, పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య) వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ప్రజా భవిష్య నిధి, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం, పోస్టాఫీసు సేవింగ్‌ స్కీం వంటి పథకాల్లో మదుపు చేసేవారు ఈ రెండింటినీ సమర్పించాల్సి ఉంటుంది. ఈ పొదుపు ఖాతాల్లో రూ.50వేలకు మించి జమ చేసేవారు తప్పనిసరిగా పాన్‌ తెలియజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆధార్‌ వివరాలు ఇవ్వకుండా, ఈ ఖాతాలు ప్రారంభించిన చందాదారులు సెప్టెంబరు 30లోగా ఆధార్‌  సమ ర్పించాల్సి ఉంటుంది. కొత్త ఖాతాలు ప్రారంభించేవారు తప్పనిసరిగా ఆధార్‌ తెలియజేయాల్సిందే. లేదా ఖాతా ప్రారంభించిన ఆరు నెలల్లోపు ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయకపోతే, ఖాతా స్తంభింపజేస్తారు. అన్ని ఖాతాల్లో కలిసి రూ.లక్షకు మించి జమ చేసిన సందర్భంలోనూ, ఒక నెలలో ఉపసంహరణలు(విత్‌డ్రా) రూ.10వేలు దాటినప్పుడూ పాన్‌ తప్పనిసరి. లేకపోతే ఖాతాల్లో లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉండదని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని