Aadhar-Pan Link: అనుసంధానం మర్చిపోకండి.. పాన్‌- ఆధార్‌పై ఐటీ శాఖ హెచ్చరిక

పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య)ను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు వ్యవధి ఈ నెలాఖరుతో ముగుస్తుందని ఆదాయపు పన్ను విభాగం గుర్తు చేసింది.

Updated : 14 Jun 2023 08:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య)ను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు వ్యవధి ఈ నెలాఖరుతో ముగుస్తుందని ఆదాయపు పన్ను విభాగం గుర్తు చేసింది. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం పాన్‌ ఉన్న ప్రతి వ్యక్తీ, దాన్ని ఆధార్‌తో జత చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే పొడిగింపు ఇచ్చినందున, ఇందుకు రూ.1,000 అపరాధ రుసుము చెల్లించాలని పేర్కొంది. ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాన్‌-ఆధార్‌ అనుసంధానం చేసుకునేందుకు లింక్‌ ఉందని తెలిపింది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారు, మరోసారి తనిఖీ చేసుకోవాలని ట్విటర్‌ వేదికగా సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని