Doms IPO: డోమ్స్‌ ఐపీఓకు భారీ స్పందన.. 93.40 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌

Doms IPO: డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు భారీ స్పందన లభించింది. చివరి రోజైన శుక్రవారం నాటికి 93.40 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి.

Updated : 15 Dec 2023 21:26 IST

Doms IPO | దిల్లీ: పెన్సిళ్ల తయారీ కంపెనీ డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు (Doms IPO) భారీ స్పందన లభించింది. శుక్రవారంతో ముగిసిన ఈ ఐపీఓకు మొత్తం 93.40 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో భారీగా బిడ్లు దాఖలయ్యాయి.

రూ.1200 కోట్లు నిధుల సమీకరణకు వస్తున్న డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ 88.37 లక్షల షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో అందుబాటులో ఉంచగా.. 82.54 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీల కోటా ఏకంగా 115.97 రెట్లు సబ్‌స్క్రైబ్‌ కాగా.. రిటైల్‌ పోర్షన్‌ 69.10 రెట్ల బిడ్లు దాఖలయ్యయి. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల కోటా 66.47 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది.

ఐపీఓలో ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.750-790గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చిన తొలి రోజే (బుధవారం) 5.71 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ పొందిన డోమ్స్‌.. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.538 కోట్లు సమీకరించింది. ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన మొత్తాన్ని కొత్త తయారీ కేంద్రం నెలకొల్పి తద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని కంపెనీ భావిస్తోంది.

ఐనాక్స్‌ ఇండియా ఐపీఓకు 7 రెట్ల స్పందన

క్రయోజనిక్‌ ట్యాంకులు తయారు చేసే ఐనాక్స్‌ ఇండియా ఐపీఓ రెండో రోజైన శుక్రవారం నాటికి 7 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. 1.54 కోట్ల షేర్లు అందుబాటులో ఉంచగా.. 10.94 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఎన్‌ఐఐ కోటా 13.73 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల పోర్షన్‌ 8.17 రెట్ల బిడ్లు దాఖలవ్వగా.. క్యూఐబీ కోటా కేవలం 17 శాతం మాత్రమే సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. ధరల శ్రేణి రూ.627-660గా కంపెనీ నిర్ణయించింది. పూర్తి ఆఫర్‌ ఫర్‌సేల్‌ పద్ధతిన షేర్లు సమీకరిస్తుండడంతో నిధులు కంపెనీకి వెళ్లవు. సోమవారంతో సబ్‌స్క్రిప్షన్‌ ముగియనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని