GPT Healthcare IPO: ప్రారంభమైన జీపీటీ హెల్త్‌కేర్‌ ఐపీఓ.. పూర్తి వివరాలివే..!

GPT Healthcare IPO: రూ.502 కోట్ల సమీకరణ లక్ష్యంతో జీపీటీ హెల్త్‌కేర్‌ ఐపీఓ గురువారం ప్రారంభమైంది.

Published : 22 Feb 2024 11:53 IST

GPT Healthcare IPO | దిల్లీ: జీపీటీ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ ఐపీఓ (GPT Healthcare IPO) గురువారం ప్రారంభమైంది. ఈ నెల 26 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. షేరు ధరల శ్రేణిని రూ.177-186 మధ్య నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.502 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ఐపీఓ (IPO)లో రూ.40 కోట్ల విలువ చేసే కొత్త షేర్లతో పాటు 2.6 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తున్నారు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమకూరిన నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తామని  జీపీటీ హెల్త్‌కేర్‌ తెలిపింది. ఐఎల్‌ఎస్‌ హాస్పిటల్స్‌ బ్రాండ్‌తో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్వహిస్తున్న ఈ సంస్థను 2000 సంవత్సరంలో కోల్‌కతా కేంద్రంగా  ప్రారంభించారు. ప్రస్తుతం 561 పడకల సామర్థ్యం ఉన్న నాలుగు పూర్తిస్థాయి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్వహిస్తున్నారు. గ్లోబల్‌ హెల్త్‌, కిమ్స్‌, జుపిటర్‌ లైఫ్ లైన్‌ వంటి నమోదిత సంస్థలతో ఇది పోటీ పడుతోంది.

మదుపర్లు రూ.14,880తో కనీసం 80 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.337.41 కోట్లుగా నమోదైన సంస్థ ఆదాయం 2023 నాటికి 7.3 శాతం పెరిగి రూ.361.03 కోట్లకు చేరింది. జేఎం ఫైనాన్షియల్‌ ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లు లిస్ట్‌ కానున్నాయి.

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • ఐపీఓ తేదీలు: ఫిబ్రవరి 22-26
  • ధరల శ్రేణి: రూ.177-186
  • షేరు ముఖ విలువ: రూ.10
  • కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 80 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.14,880
  • అలాట్‌మెంట్ తేదీ: ఫిబ్రవరి 27
  • రిఫండ్‌ తేదీ: ఫిబ్రవరి 28
  • లిస్టింగ్‌ తేదీ: ఫిబ్రవరి 29

(గమనిక: ఐపీఓలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఐపీఓలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని