Amazon: అమ్మకానికి ‘అమెజాన్‌’ పుట్టినిల్లు..!

ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన ‘అమెజాన్‌’ పుట్టినిల్లు ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉంది.

Published : 24 Jan 2024 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌లో ఓ చిన్న పుస్తక విక్రయ వేదికగా ప్రారంభమైన అమెజాన్‌ (Amazon).. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన విషయం తెలిసిందే. అలాంటి ‘అమెజాన్‌’ పుట్టినిల్లు ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉంది. 1540 అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆ ఇంటిని 2001లో పునర్నిర్మించారు. ప్రస్తుతం దాని ధర 2.28 మిలియన్‌ డాలర్లుగా పేర్కొన్నట్లు సమాచారం.

1994లో జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos), ఆయన మాజీ భార్య మెకంజీ స్కాట్‌లు కలిసి అమెరికాలోని సియాటెల్‌లో ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నారు. మూడు బెడ్‌రూమ్‌లున్న ఆ ఇంటినే కార్యాలయంగా మార్చుకొని ఆన్‌లైన్‌లో పుస్తకాలను విక్రయించడం మొదలుపెట్టారు. ఓ కంప్యూటర్‌, ఒక డెస్కు, చిన్న ఆఫీసుకు అవసరమైన సామగ్రి మాత్రమే ఉండేవి. ఆ ఇంటికి బెజోస్‌ నెలకు 890 డాలర్లు అద్దె చెల్లించేవారట.

మూడేళ్లలో రూ.కోటి కోట్లకు

అమెజాన్‌ (Amazon) మొదట్లో కేవలం పుస్తకాలను మాత్రమే విక్రయించేది. అనంతరం కొన్నేళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్‌ను సొంతం చేసుకొని పలు రంగాల్లో దూసుకెళ్తోంది. దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్‌.. ప్రస్తుత మార్కెట్‌ విలువ 1.6 ట్రిలియన్‌ డాలర్లుగా అంచనా. ప్రపంచంలోనే ఐదో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని