ఐనాక్స్‌ ఇండియా అదుర్స్‌.. 44 శాతం ప్రీమియంతో లిస్టింగ్‌

INOX India IPO: ఐనాక్స్‌ ఇండియా గురువారం మార్కెట్లలో లిస్టైంది. 44 శాతం ప్రీమియంతో షేర్లు ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Published : 21 Dec 2023 13:14 IST

INOX India IPO | దిల్లీ: క్రయోజనిక్‌ ట్యాంకులు తయారు చేసే ఐనాక్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ (INOX India IPO) గురువారం లిస్టింగ్‌లో అదరగొట్టింది. ఇష్యూ ధర రూ.660 కంటే 44 శాతం ప్రీమియంతో ఈ కంపెనీ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయ్యాయి. బీఎస్‌ఈలో 41.38 శాతం ప్రీమియంతో రూ.993.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తర్వాత 48 శాతం లాభంతో రూ.978కు చేరాయి. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ 43.88 శాతం లాభంతో రూ.949.65 వద్ద ఈ షేర్లు ట్రేడింగ్‌ను ఆరంభించాయి.

లిస్టింగ్‌లో రాణించిన నేపథ్యంలో కంపెనీ మార్కెట్‌ విలువ ఈ ఉదయం రూ.8,522 కోట్లకు చేరింది. రూ.1459.32 కోట్ల ఐపీఓకు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ విభాగంలో 61.28 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి. ధరల శ్రేణిని రూ.627-660గా కంపెనీ నిర్ణయించింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయిస్తుండడంతో నిధులన్నీ వాటాదారులకే వెళ్లనున్నాయి. వడోదరకు చెందిన ఐనాక్స్‌ ఇండియా 30 ఏళ్లుగా క్రయోజనిక్‌ ట్యాంకుల డిజైన్‌, ఇంజినీరింగ్‌, తయారీ తదితర రంగాల్లో సేవలు అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని