Maruti Suzuki: మారుతీ సుజుకీ అదుర్స్‌.. లాభం డబుల్‌

Maruti Suzuki Q1 Results: క్యూ1లో మారుతీ సుజుకీ రెట్టింపు లాభాన్ని నమోదు చేసింది. మొత్తం 4.98 లక్షల వాహనాలను ఈ త్రైమాసికంలో విక్రయించింది.

Published : 31 Jul 2023 16:52 IST

దిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) త్రైమాసిక ఫలితాల్లో (Q1 Results) అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో రెండింతలకుపైగా వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1036 కోట్లుగా ఉన్న నికర లాభం రూ.2,525 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం సైతం రూ.26,512 కోట్ల నుంచి రూ.32,338 కోట్లకు పెరిగినట్లు ఎక్స్ఛేంజీకిచ్చిన సమాచారంలో ఆ కంపెనీ పేర్కొంది.

మణిపుర్‌ పోలీసుల నిర్లక్ష్యంపై సుప్రీం ఆగ్రహం.. ప్రశ్నల వర్షం!

సమీక్షా త్రైమాసికంలో మొత్తం 4,98,030 వాహనాలను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే 6.4 శాతం మేర పెరగడం గమనార్హం. అదే సమయంలో దేశీయ విక్రయాల్లో 9 శాతం వృద్ధి నమోదవ్వగా.. ఎగుమతుల్లో 9 శాతం క్షీణత నమోదైంది. ఇంకా 3.55 లక్షల వాహన ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వీలైనంత త్వరగా వాటిని డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు కంపెనీ ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో సోమవారం మారుతీ సుజుకీ షేర్లు 1.6 శాతం లాభంతో రూ.9,821 వద్ద ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు