IPO Subcription satus: మోతీసన్స్‌ ఐపీఓకు భారీ స్పందన.. 159 రెట్ల బిడ్లు దాఖలు

IPO: ఈ వారం ఐపీఓకు వచ్చిన వాటిలో మోతీసన్స్‌ టాపర్‌గా నిలచింది. మదుపరుల నుంచి భారీ స్పందన అందుకున్న ఈ ఐపీఓ మొత్తం 159 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది.

Published : 20 Dec 2023 20:12 IST

IPO status | ముంబయి: రిటైల్‌ ఆభరణాల సంస్థ మోతీసన్స్‌ జువెలర్స్‌ ఐపీఓకు (Motisons Jewellers IPO) మదుపరుల నుంచి భారీ స్పందన లభించింది. చివరి రోజైన బుధవారం నాటికి ఐపీఓ (IPO) 159.61 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. రూ.151 కోట్లు సమీకరించే ఉద్దేశంతో వచ్చిన ఈ కంపెనీ 2.08 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచగా.. 333 కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కోటా 233.91 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అవ్వగా.. క్యూఐబీల కోటా 157.40 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా 122.28 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను సాధించాయి. ఐపీఓలో భాగంగా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.52-55 చొప్పున నిర్ణయించారు. మొత్తం 2.74 కోట్ల ఈక్విటీ షేర్లను ఫ్రెష్‌ షేర్లుగా జారీ చేశారు. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.36 కోట్లను కంపెనీ సమీకరించింది.

  • ముత్తూట్‌ ఐపీఓకు కూడా అద్భుతమైన స్పందన లభించింది. చివరి రోజు పూర్తయ్యేసరికి 11.52 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. రూ.960 కోట్లు సమీకరించేందుకు ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ.. ధరల శ్రేణిని రూ.277-291గా నిర్ణయించింది. రిటైల్‌ పోర్షన్‌ 7 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది.
  • సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ఐపీఓ చివరి రోజు పూర్తయ్యేసరికి 15.65 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. క్యూఐబీల కోటా 24.31 రెట్లు, ఎన్‌ఐఐ కోటా 18.90 రెట్లు, రిటైల్‌ కోటా 9.30 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి.
  • ముఫ్తీ బ్రాండ్‌పై జీన్స్‌లను విక్రయించే క్రెడో బ్రాండ్స్‌ ఐపీఓ రెండో రోజైన బుధవారం నాటికి 6.94 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. రూ.549.77 కోట్ల ఐపీఓలో ధరల శ్రేణిని రూ.266-280గా నిర్ణయించారు.
  • ఆర్‌బీజడ్‌ జువెలర్స్‌ కూడా రెండో రోజు పూర్తయ్యేసరికి 7.13 రెట్లు బిడ్లు అందుకుంది. రూ.100 కోట్లు సమీకరించేందుకు వస్తున్న ఈ ఐపీఓలో ధరల శ్రేణిని రూ.95-100గా కంపెనీ నిర్ణయించింది.
  • వెయ్యి కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించేందుకు వచ్చిన హ్యాపీ ఫోర్జింగ్స్‌ ఐపీఓ సైతం రెండో రోజు పూర్తయ్యేసరికి 7.46 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. 
  • ఆజాద్‌ ఇంజినీరింగ్‌ సబ్‌స్క్రిప్షన్‌ బుధవారం ప్రారంభమైంది. తొలి రోజే 3.30 రెట్ల బిడ్లను అందుకుంది.

నోట్‌: ఈ వార్త/ కథనం సమాచారం కోసం మాత్రమే. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులను ఈనాడు.నెట్ ప్రోత్సహించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని