Mumbai: అందులో.. ముంబయిది ప్రపంచంలోనే నాలుగో స్థానం!

విలాసవంతమైన భవనాల ధరలు వేగంగా పెరుగుతోన్న నగరాల జాబితాను నైట్‌ఫ్రాంక్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో ముంబయి నాలుగోస్థానంలో నిలిచింది.

Updated : 02 Nov 2023 03:45 IST

ముంబయి: నగరాల్లో విలాసవంతమైన నివాస భవనాల ధరలు ఏడాదికి ఏడాది భారీగా పెరుగుతున్నాయి. ఈ విషయంలో దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయి ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. విలాసవంతమైన భవనాల ధరలు భారీగా పెరుగుతున్న నగరాల మూడో త్రైమాసిక జాబితాను ‘ప్రైమ్‌ గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ క్యూ3 2023’పేరుతో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ విడుదల చేసింది. ఇందులో 46 నగరాలుండగా.. తొలి మూడు స్థానాల్లో మనీలా(ఫిలిప్పీన్స్‌), దుబాయ్‌(యూఏఈ), షాంఘై(చైనా) నిలిచాయి. ముంబయి నాలుగో స్థానంలో, దేశ రాజధాని దిల్లీ పదో స్థానంలో ఉన్నాయి. బెంగళూరు నగరం 17 స్థానంలో ఉంది. జులై-సెప్టెంబర్‌ కాలంలో ముంబయి, బెంగళూరు, న్యూ దిల్లీలోని విలాసవంతమైన నివాస భవనాల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయని నైట్‌ఫ్రాంక్‌ పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు