Narayana Murthy: మనవడికి నారాయణమూర్తి ఖరీదైన గిఫ్ట్‌

నారాయణ మూర్తి తన మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చారు. తాత ఇచ్చిన బహుమతితో భారత్‌లోనే అత్యంత పిన్నవయస్కుడైన బిలియనీర్ల జాబితాలో ఏకాగ్రహ్‌ చోటు దక్కించుకున్నాడు.

Updated : 18 Mar 2024 17:36 IST

దిల్లీ: ఇన్ఫోసిస్ (Infosys) సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) తన మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చారు. ఏకంగా కంపెనీలో 15 లక్షల షేర్లను అతని పేరు మీద రిజిస్టర్ చేశారు. వీటి విలువ సుమారు రూ.240 కోట్లు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. కంపెనీలో తన వాటా షేర్లలో కొన్నింటిని మనవడికి బహుమతిగా ఇచ్చినట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించారు. నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్‌లో 0.40 శాతం వాటా ఉంది. ఆయన వద్ద 1.51 కోట్ల కంపెనీ షేర్లు ఉన్నాయి. గతేడాది నవంబరులో ఆయన కొడుకు రోహన్‌ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్‌లకు ఏకాగ్రహ్ జన్మించాడు. 

తాత ఇచ్చిన విలువైన బహుమతితో ఏకాగ్రహ్‌కు ఇన్ఫోసిస్‌లో 0.04 శాతం వాటా లభించింది. దీంతో భారత్‌లో అత్యంత పిన్నవయస్కుడైన మిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు అక్షతా మూర్తి, కొడుకు రోహన్‌ మూర్తి. అక్షతా మూర్తి, 2009లో రిషి సునాక్‌ (ప్రస్తుత బ్రిటన్‌ ప్రధాని)ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఇక రోహన్‌ మూర్తికి 2011లో టీవీఎస్ కంపెనీ ఛైర్మన్ వేణుశ్రీనివాసన్‌ కుమార్తె లక్ష్మితో వివాహం జరిగింది. ఈ జంట 2015లో విడిపోయారు. 2019లో అపర్ణ కృష్ణన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి సంతానమే ఏకాగ్రహ్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని