OLA Electric: ఐపీఓకు ఓలా ఎలక్ట్రిక్‌ దరఖాస్తు

ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ నిధులు సమీకరించేందుకు ఐపీఓకు దరఖాస్తు చేసింది. 

Published : 23 Dec 2023 11:20 IST

దిల్లీ: తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) వద్ద విద్యుత్‌ ద్విచక్రవాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ శుక్రవారం ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. గత 20 ఏళ్లలో మన దేశంలో ఐపీఓకు రానున్న తొలి వాహన సంస్థ ఇదే కావడం విశేషం. ముసాయిదా పత్రాల ప్రకారం.. ఐపీఓలో రూ. 5,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 95,191,195 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను మూల ధన వ్యయాల, ఓలా గిగాఫ్యాక్టరీ ప్రాజెక్ట్‌, అనుబంధ సంస్థ ఓఈటీ రుణాల చెల్లింపు, పరిశోధనా, ఉత్పత్తుల అభివృద్ధికి పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనుంది. కంపెనీ విద్యుత్‌ స్కూటర్లతోపాటు, బ్యాటరీ ప్యాక్స్‌, మోటార్ల వంటి విడిభాగాలను ఉత్పత్తి చేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని